ఆర్ఎక్స్ 100 సినిమా తో టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న అజయ్ భూపతి దర్శకత్వం లో అదే సినిమా తో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం మంగళవారం.ఎన్నో అంచనాల మధ్య నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకొని భారీ విజయాన్ని అందుకుంది. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి భారీ కలక్షన్స్ రాబట్టింది. ఇక ఈ చిత్రం లో నందిత శ్వేత, దివ్య పిల్లై, అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్ ఇతర కీలక పాత్ర ల్లో నటించారు. థియేటర్ లో మిస్ అయ్యిన వారు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ లో వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి ఈ చిత్రం ఓటిటీ హక్కులు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని కొందరు.. ఆహా కొన్నది అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఆ రెండు కాకుండా మంగళవారం డిజిటల్ హక్కులను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్నీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో మంగళవారం సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాష ల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా ప్రీమియర్ డేట్ ను త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. ఈ నెలలోనే మంగళవారం సినిమా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ప్రీమియర్ కానుంది. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది. మరి థియేటర్ లో హల్చల్ చేసిన ఈ సినిమా ఓటిటీ లో ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: