యానిమల్ సక్సెస్ తర్వాత స్పిరిట్ పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్రభాస్ తో సందీప్ వంగా చేయబోయే సినిమాపై ఇప్పటికే ఎన్నో రకాల ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఎలాంటి జోనర్ లో ఉండబోతుందో మూవీ టీం నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కాకపోతే ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. స్పిరిట్ మూవీలో బ్రూటల్ వయిలెన్స్, అడల్ట్ సీన్స్ అండ్ డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని, మొత్తం సందీప్ గా బ్రాండ్ తోనే ఈ ప్రాజెక్టు ఉంటుందని వార్తలు వచ్చాయి. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు సందీప్ రెడ్డి వంగ

ఫిలిం మేకింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా, తను ఏదైతే చూపించాలని అనుకుంటాడో దాన్ని సినిమాలో అలాగే చూపిస్తాడు. అది విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్ ఎవరైనా కావచ్చు. హీరోకి ఉన్నా క్రేజ్ తో సందీప్ కి ఎటువంటి సంబంధం లేదు. అందుకే అప్పటివరకు సాఫ్ట్ ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండ, షాహిద్ కపూర్, రన్బీర్ కపూర్ అందరూ సందీప్ విజన్ కి లొంగిపోయారు. దాంతో బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాల రిజల్ట్ ఏంటో చెప్పనవసరం లేదు. సందీప్ తన హీరోలను ఇతర దర్శకులు కూడా ఎక్స్ పెక్ట్ చేయని విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేస్తాడు.

 అలాంటి ఈ డైరెక్టర్ భారీ ఇమేజ్ అండ్ క్రేజ్ ఉన్న ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ ఉంది. అలాంటి ఈ హీరో విజయ్ దేవరకొండ, రణబీర్ కపూర్ లాగా అడల్ట్ సీన్స్ లో నటిస్తే ఖచ్చితంగా ట్రోల్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు ప్రభాస్ కి సిగ్గు, బిడియం,మొహమాటం ఎక్కువ. అలాంటి ప్రభాస్ ని సందీప్ రెడ్డి వంగ మ్యాడ్ వరల్డ్ లో ఊహించుకోవడం అంటే అది అసాధ్యం. మరి సందీప్ వంగ విజన్ కి ప్రభాస్ లొంగుతాడా?  లేక ప్రభాస్ ఇమేజ్ కి లొంగి తన విజన్ ని మార్చుకుంటాడా? అనేది చూడాలి. ఒకవేళ ప్రభాస్ కనుక సందీప్ రెడ్డి వంగా జోన్ కి ఓకే చెబితే రిజల్ట్ మరోలా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: