హిందీ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఈయన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఇప్పటికే షారుఖ్ ఈ సంవత్సరం మొదటగా పఠాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఏకంగా ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న షారుక్ కొంత కాలం క్రితమే తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో రూపొందిన జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ ను అందుకొని 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇలా వరుసగా రెండు విజయాలను అందుకున్న షారుఖ్ ఈ సంవత్సరం డాంకీ అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు.

మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తాప్సి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 58.58 మిలియన్ వ్యూస్ ను అందుకుంది. ఇలా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: