ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్నా సినిమాల్లో సలార్ మూవీ ఒకటి. ఈ మూవీ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... రవి బుశ్రుర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. జగపతి బాబు , పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం ఒక ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రేంజ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఒక యాక్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేయాలి అని డిసైడ్ అయినట్లు అందుకు సంబంధించిన పనులు కూడా ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని యాక్షన్ ట్రైలర్ ను ఈ నెల 16 వ తేదీన కానీ 18 వ తేదీన కానీ విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ లోని ఒక సాంగ్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లోని ఒక సాంగ్ ను సినిమా విడుదలకు ముందు రోజు విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: