టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఆఖరుగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో రూపొందిన "ది ఘోస్ట్" అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ'లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ , నాగార్జున కు జోడిగా నటించింది. మంచి అంచనాల నడుమ పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా ది ఘోస్ట్ మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన నాగార్జున ఆ తర్వాత మూవీ కోసం కాస్త సమయం తీసుకొని కొన్ని రోజుల క్రితమే "నా సామి రంగ" అనే మూవీ ని మొదలు పెట్టాడు.

మూవీ కి ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. అందుకు అనుగుణం గానే ఈ సినిమా షూటింగ్ ను ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తోంది. ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని మొదటి పాటను కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ జనాలు నుండి లభిస్తుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. రెండు పాటలు మరియు ఒక ఫైట్ సన్నివేశం మినహా ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ రెండు పాటలు మరియు ఒక ఫైట్ సన్నివేశాన్ని కూడా ఈ మూవీ బృందం చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ యొక్క మొదటి కాపీ కూడా డిసెంబర్ 25 వ తేదీ వరకు రెడీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: