రైటర్ గా పలు హిట్ సినిమాలకు కథలు అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా సూపర్ ఫ్లాప్ అయ్యాడు. నా పేరు సూర్య రాంగ్ అటెంప్ట్ అనుకున్నా, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీ డైరెక్టర్ గా అతని క్యాపబిలిటీపై డౌట్స్ రేకెత్తించింది. ఆమధ్య వచ్చిన ఏజెంట్ తో అతనికి రైటర్ గానూ పెద్ద డెంట్ పెట్టింది. ఈ క్రమంలోనే వక్కంతం వంశీ పై ఆడియన్స్ లో కొంత నెగిటివిటీ ఏర్పడింది. అంతేకాదు మంచి కథలను వక్కంతం వంశీ చెడగొడుతున్నాడనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. దర్శకుడిగా అతని దగ్గర మంచి కథాంశాలు ఉన్నప్పటికీ దాన్ని మంచి సినిమాగా తీయడంలో విఫలమయ్యాడు. 

ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 8న విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంది. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రైటర్స్ లో వక్కంతం వంశీ ఒకరు. అందరి రైటర్స్ లానే ఆయన కూడా దర్శకత్వంపై ఆసక్తి చూపించాడు. మెగా ఫోన్ పట్టి అల్లు అర్జున్ తో నా పేరు సూర్య సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ స్టోరీ లైన్ బాగుందని సినిమా చూసిన వాళ్లంతా భావించారు. కానీ ప్రజెంటేషనే బాలేదనే కామెంట్స్ వినిపించాయి. ఇక వంశీ రెండో మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కి కూడా సేమ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా చూసిన జనాలు సినిమాలో ఇంట్రెస్టింగ్ లైన్ ఉందని, 

కానీ అందుకు తగ్గట్టు మంచి ట్రీట్మెంట్ ఉంటే బాగుండేదని భావించారు. వంశీ తన బ్యాడ్ ప్రజెంటేషన్ తో మంచి కథలను చెడగొట్టుకుంటున్నాడని, ఫలితంగా అతని సినిమాలకు బ్యాడ్ రిజల్ట్స్ వస్తున్నాయని, రచయితగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఇతను దర్శకుడిగా మాత్రం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాడంటూ సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ వైఫల్యాల నుంచి వంశీ ఎన్నో పాఠాలు నేర్చుకుని ఇప్పటికైనా తన ప్రజెంటేషన్ మార్చుకోవాలి. లేకపోతే రచయితగా తాను రాసే మంచి కథలన్నీ తప్పుదోవ పట్టడం ఖాయం. ఇక ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ వచ్చినప్పుడు ఈ మూవీ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అంతా భావించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: