సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు వాటిని రుజువు చేశాయి. అయినా కూడా కొందరు డిస్ట్రిబ్యూటర్లు పాత సినిమాలను రీ రిలీజ్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న డిసెంబర్ 2న సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు సినిమాని గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెగ హంగామా చేశారు. తీరా చూస్తే దాన్నెవరూ పట్టించుకోకపోవడంతో దాదాపు అన్ని చోట్ల షోలు క్యాన్సిల్ అయిపోయాయి. తిరిగి మళ్లీ రీ రిలీజ్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇక్కడితో ఆగకుండా మళ్లీ డిసెంబర్ 12న రజనీకాంత్ పుట్టినరోజు ఉండడంతో శివాజీ మూవీని రీ రిలీజ్ చేస్తున్నట్లు పబ్లిసిటీ కూడా చేశారు. 

ఇప్పుడు ఆ మూవీ కూడా వాయిదా పడింది. రీ రిలీజ్ కి ఉన్న క్రేజ్ తగ్గిపోవడం, కొత్త టికెట్ రేట్లతో పదేపదే సినిమా చూసేందుకు ఆడియన్స్ ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. దీంతో గత రెండు మూడు నెలల్లో వచ్చిన శంకర్ దాదా ఎంబిబిఎస్, అదుర్స్ లాంటి సినిమాలు ఒకటి రెండు చోట్ల తప్ప చాలా సెంటర్స్ లో కనీసం ఓపెనింగ్స్ కూడా తేలేకపోయాయి. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ శివాజీ రీ రిలీజ్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ఈ రీ రిలీజ్ ట్రెండ్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు చూస్తే ఆడియన్స్ లో ఎలాంటి ఇంట్రెస్ట్ కనిపించడం లేదు. 

బాలయ్య క్లాసిక్ మూవీ భైరవద్వీపం కూడా రీ రిలీజ్ కి ప్లాన్ చేసినా ఆడియన్స్ లో పెద్దగా బజ్ లేకపోవడంతో దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు ఇదే దారిలో రజనీకాంత్ శివాజీ మూవీ కూడా రీ రిలీజ్ క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. కాగా శివాజీ మూవీని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించగా ఇందులో రజనీకాంత్ సరసన శ్రియ శరణ్ హీరోయిన్గా నటించింది. సీనియర్ హీరో సుమన్, వివేక్, మనివన్నన్, రఘువరన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. AVM ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: