పాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా సలార్. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.ఈ మూవీపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ చేసిన మూడు సినిమాలు ఫ్యాన్స్ ని మెప్పించలేదు. దీంతో సలార్ సినిమా కచ్చితంగా అభిమానుల ఆకలి తీరుస్తుందని అంచనా వేస్తున్నారు.ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. మూవీలో దేవా పాత్రలో ప్రభాస్ పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడని ఆ ట్రైలర్ తోనే స్పష్టం అయ్యింది. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి పార్ట్ సీజ్ ఫైర్ తో ప్రభాస్ థియేటర్స్ లో విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ఇంకో పదిరోజుల సమయం మాత్రమే ఉంది.విడుదలకు ముందే USA లో హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ దాటి రికార్డ్ క్రియేట్ చేసింది.అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లేవు. ఇంకా సాంగ్స్ కూడా రిలీజ్ చేయలేదు.


తాజాగా వినిపిస్తోన్న టాక్ బట్టి ఈ మూవీ ప్రమోషన్స్ లేకుండానే డైరెక్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకి కూడా ప్రీరిలీజ్ ఈవెంట్స్ పెట్టడంతో పాటు రెండు వారాల ముందుగానే మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటివి చేస్తున్నారు.అసలు ఎలాంటి ప్రమోషన్ యాక్టివిటీస్ లేకుండా సలార్ మూవీని రిలీజ్ చేయబోతున్నారంట. ఆదిపురుష్ సినిమాకి ప్రభాస్ ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. అయితే ప్రీరిలీజ్ ఈవెంట్ మాత్రం గ్రాండ్ గా చేశారు.కానీ సలార్ సినిమాకి అది కూడా పెట్టడం లేదు. వెయ్యి కోట్ల దర్శకుడు, 1000 కోట్ల పైగా కలెక్షన్స్ అందుకున్న హీరో కాంబోలో వస్తోన్న సినిమా అనే ఒక్క బ్రాండ్ తోనే సలార్ ని థియేటర్స్ లో వదులుతున్నారు. అస్సలు ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహించకపోవడానికి కారణం ఏంటి, కనీసం సాంగ్స్ కూడా రిలీజ్ చేసుకోకపోవడానికి రీజన్ ఏమి ఉండొచ్చు అనేది అభిమానులకి అర్ధం కావడం లేదు.అయితే ప్రభాస్, ప్రశాంత్ నీల్ ఇమేజ్ సినిమాకి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని మూవీ యూనిట్ బలంగా నమ్ముతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: