కోలీవుడ్లో స్టార్ కమెడియన్గా కొనసాగుతున్నారు యోగి బాబు. సాధారణంగా కమెడియన్స్ అనగానే ఏవో డైలాగులు చెప్పి నవ్విస్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ యోగి బాబు విషయంలో అలా కాదు. ఆయన తెరమీద కనిపించారు అంటే చాలు ప్రేక్షకులందరూ కూడా నవ్వుకుంటారు. ఒక చిన్న డైలాగ్ చెబితే చాలు పొట్టు చెక్కలయ్యేలా నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్గా ఎదిగారు యోగి బాబు. అయితే తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతుండడంతో ఇక్కడ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యారు.


 స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు ఆయన. అయితే ఇక ఇప్పుడు  ఏదైనా స్టార్ హీరో సినిమా తెరమీదకి వచ్చింది అంటే అందులో యోగి బాబు తప్పకుండా ఛాన్స్ దక్కించుకుంటున్నాడు. అయితే ఇన్ని రోజుల వరకు తమిళ డబ్ సినిమాలతో అటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యోగి బాబు ఇప్పుడు వరకు నేరుగా తెలుగు సినిమా మాత్రం చేయలేదు. కానీ ఇప్పుడు ఏకంగా నేరుగా తెలుగు సినిమా చేయబోతున్నాడట. అయితే ప్రస్తుతం యోగి బాబుకి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది అని తెలుస్తోంది.



 ఏకంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా హీరోగా ఎదిగిన బడా హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసాడట. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్నది తెలుస్తుంది. ఇక ఈ మూవీలో యోగి బాబు కూడా నటిస్తూ ఉన్నాడట. ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకేక్కుతుంది  డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా  కోసం ఎప్పటినుంచో డార్లింగ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. హర్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ మూవీలో యోగి బాబు కూడా నటిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: