కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ చంద్రముఖి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించగా ... పి వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో ప్రభు , జ్యోతిక కీలక పాత్రలలో నటించగా ... నాజర్ , వడివేలు ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఆ సమయంలో తమిళ , తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఇలా ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడంతో తాజాగా దర్శకుడు పి వాసు ... రాఘవ లారెన్స్ హీరోగా చంద్రముఖి 2 అనే మూవీ ని రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దానితో ఈ సినిమాకు భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు. ఇకపోతే ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం పరవాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది.

ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే జెమినీ టీవీ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: