తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ నటిగా ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటిఫుల్ నటి ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో మీనాక్షి తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. 

దానితో ఈ బ్యూటీ కి తెలుగు కుర్రకారు ప్రేక్షకుల నుండి ఫుల్ క్రేజ్ లభించింది. దానితో ఈ బ్యూటీ కి ప్రస్తుతం తెలుగు , తమిళ ఇండస్ట్రీ నుండి వరుస క్రేజీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా తాజాగా ఈ నటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మీనాక్షి తో పాటు శ్రీ లీల కూడా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ మూవీ నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

కాకపోతే మీనాక్షి చౌదరి కి సంబంధించిన ఒక్క పోస్టర్ ను కూడా విడుదల చేయలేదు. దానితో ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఉందా లేదా అనే అనుమానాలు కూడా కొంత మంది ప్రేక్షకుల్లో వచ్చాయి. దానితో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాలోని మీనాక్షి కి సంబంధించిన పోస్టర్ నీ విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో మహేష్ కూర్చొని ఉండగా అతని భుజాలపై చేతులు వేసుకొని వెనకాల మీనాక్షి చౌదరి నిలబడి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: