తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారి లో హను రాగవపూడి ఒకరు. ఈయన అందాల రాక్షసి అనే మూవీ తో దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను ఈయనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈయన ఆఖరు గా సీత రామం అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించగా ... మృణాల్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది . ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను హను రాఘవపుడి కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తో ఈయన క్రేజ్ అమాంతం ఒక్క సారిగా పెరిగి పోయింది . ఈ మూవీ తర్వాత ఈయనకు ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి ప్రభాస్ నుండి ఆఫర్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఈ వార్తలు దాదాపు వాస్తవమే అని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా హను రాఘవపూడి ... ప్రభాస్ కు ఓ కథ ను వినిపించగా ఆ కథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో వెంటనే ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ క్రేజీ కాంబో మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించనుండగా ... విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీ కి సంగీత అందించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: