ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సూపర్ హీరో అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే హనుమాన్ మూవీ ఎంతో రిస్క్ చేసి సంక్రాంతి బరిలో నిలిచింది. అప్పటికే సంక్రాంతి రేసులో నాగార్జున మహేష్ బాబు వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. అయినప్పటికీ అటు హనుమాన్ మూవీ మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ సినిమా మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో ఈ సినిమాను నిలిపారు.


 ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఎందుకు అంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారు అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. స్టార్ హీరోల సినిమాలను వెనక్కి నెట్టి ఇక ఈ సంక్రాంతికి పందెం నెగ్గింది హనుమాన్ మూవీ. ఏకంగా భారీ వసూళ్లు సాధించింది అని చెప్పాలి. 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది ఈ మూవీ. ఏకంగా నిర్మాతలకు లాభాల పంట పండించింది అని చెప్పాలి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ టెన్ సినిమాల్లో నిలిచింది హనుమాన్. సంక్రాంతి సీజన్ పరంగా ఆల్టైం రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పాలి.


 సాధారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ ను ఎంతో కీలకంగా భావిస్తూ ఉంటారు బడాబడా స్టార్లు. ఈ సీజన్లో తమ సినిమాలను విడుదల చేసి రికార్డులు క్రియేట్ చేయాలని అనుకుంటారు. అలాంటిది ఒక కుర్ర హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ సంక్రాంతి సీజన్కు బెంచ్ మార్క్ సెట్ చేసింది. సంక్రాంతి సీజన్ లో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.  ఏకంగా 260 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో ఇప్పుడు వరకు అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమా టాప్ లో ఉండగా ఇప్పుడు హనుమాన్ దీనిని బీట్ చేసింది. ఏకంగా ఇప్పటివరకు 265 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది అని చెప్పాలి  ఇక ఫుల్ రన్ లో 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: