ఆదా శర్మ ప్రధాన పాత్రలో ది కేరళ స్టోరీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండా పోయిన సంవత్సరం మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత పలానా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది అని అనేక సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఏ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కూడా అందుబాటు లోకి రాలేదు. 

ఇకపోతే విడుదల అయినా ఇన్ని రోజులకు ఈ సినిమా "ఓ టి టి" విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి "జీ 5" సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని ఈ సంవత్సరం ఫిబ్రవరి 16 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది. ఇకపోతే ఇప్పటికే థియేటర్ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: