మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయింది.

ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించబోతుంది. అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో కీలక పాత్రలలో కనిపించనుండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ఇందులో రామ్ చరణ్ కు జోడి గా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే బుచ్చిబాబు మూవీ తర్వాత చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులు అయినటువంటి సంజయ్ లీలా బన్సాలి , రాజ్ కుమార్ హి , రోహిత్ శెట్టి లలో ఎవరో ఒకరితో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం చరణ్ హిందీ దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఏ దర్శకుడిని కూడా ఫైనల్ చేయలేదు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: