అల్లు అర్జున్ మరియు రకుల్ ప్రీత్ నటించిన సరైనోడు సినిమాలో తెలుసా తెలుసా అనే ఒక పాట ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు అయితే ఆ పాట అద్భుతంగా రావాలని భావించిన అల్లు అరవింద్ ఎంత ఖర్చైనా పర్వాలేదు దాన్ని చాలా గ్రాండ్ ఇయర్ గా ఎవరూ తీయనంత క్వాలిటీ గా తీయాలి అని చెప్పారట. అందుకోసం డైరెక్టర్ ఏకంగా ఇప్పటివరకు ఇండియా లో ఎవరూ ఒక షూట్ చేయని లొకేషన్ ని కన్ఫర్మ్ చేసుకుని మరి వెళ్లి చేసుకోవచ్చాడు. ఇంతకీ ఆ లోకేషన్ ఏంటి అంటే సౌత్ అమెరికా లోని బొలీవియా. అక్కడ నుంచి 50 గంటల పాటు విమానంలో ప్రయాణం చేస్తే కానీ ఆ బ్యూటిఫుల్ లోకేషన్ రాదు.
అంత రిస్క చేసుకుని నాలుగు విమానాల్లో టీం అంతా కూడా అక్కడికి. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయని.. గట్టిగా మాట్లాడకూడదు వేగంగా నడవకూడదు. ఇక ఈ సాల్ట్ ఫ్లాట్ లొకేషన్ లో కిందంతా ఉప్పు ఉంటుంది ఎవరైనా పొరపాటున జారి కింద పడిన స్కిన్ మొత్తం తెగిపోతుంది. అంత షార్ప్ ఉప్పు పై షూట్ చేశారు. అలా అయితే తప్ప అక్కడ పని పూర్తి కాదు అని తెలిసి నాలుగు రోజుల పాటు టీమ్ అంతా కూడా అలాంటి సాహసం చేసి తక్కువ ఆక్సిజన్ ఉన్న ఆ ప్రాంతంలోనే షూటింగ్ పూర్తిచేసుకుని ఇండియాకి తిరిగివచ్చారు. ఆ పాట చూస్తే ఇప్పుడు మీకు ఎంత అద్భుతమైన లొకేషన్ లో షూట్ చేశారో మీకు అర్థమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి