హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు హీరో సందీప్ కిషన్. తనకు 'టైగర్' లాంటి హిట్ ఇచ్చిన వీఐ ఆనంద్‌ తో కలిసి చేసిన కొత్త సినిమానే ఈ 'ఊరు పేరు భైరవకోన'. విడుదలకు ముందే కొంచెం మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా.. ఆ అంచనాలను అందుకుందో తెలుసుకుందాం.


మూవీ టీం పెంచిన అంచనాలు తొలి రోజు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఉపయోగపడతాయి కానీ.. కంటెంట్ మాములుగా అనిపిస్తే ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతారు. అయితే 'ఊరు పేరు భైరవకోన' సినిమాతో ఉన్న సమస్య ఇదే. ఈ సినిమా గురించి ఏమీ తెలియకుండా వెళ్లి థియేటర్లలో కూర్చుంటే ఇందులోని కొన్ని అంశాలు మాత్రమే థ్రిల్ కలిగిస్తాయి.కొన్ని అయితే సీన్లు నవ్విస్తాయి.మొత్తానికి సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ 'టైగర్' కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాల తర్వాత వీఐ ఆనంద్ అదే ఫాంటసీ థ్రిల్లర్ జానర్లో రూపొందించిన సినిమా.. లాంగ్ టైం మేకింగ్.. విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువ ప్రాధాన్యం.. పైగా గరుడపురాణంతో ముడిపడ్డ కథ గురించి ట్రైలర్లో హింట్.. విడుదలకు రెండు రోజుల ముందే ప్రిమియర్స్ వేయడంలో మేకర్స్ చూపించిన కాన్ఫిడెన్స్.. ఈ అంశాలన్నీ సినిమా మీద జనాలకు అంచనాలు భారీగా పెంచాయి. ఆ అంచనాలతో ఎంతో ఊహించుకుని థియేటర్లలో అడుగు పెట్టిన ప్రేక్షకులకు తెర మీద చూసిన తరువాత అంత అద్భుతంలా ఏదీ కనిపించదు.


సినిమాలో కామెడీ బాగుంటుంది.హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ మాములుగా అనిపిస్తుంది. అందులో ఫీల్.. ఎమోషన్ అంతగా ఉండదు. క్లైమాక్స్ ఓ మోస్తరుగా అనిపిస్తుంది. చివరగా మనం ఊహించుకున్న దానికి.. తెర మీద చూసిన దానికి సంబంధం ఉండదు. కథలోని ట్విస్టులతో అక్కడక్కడ మాత్రం కొంచెం థ్రిల్ ఫీలవుతాం.కానీ కామెడీ సీన్లు కొంత నవ్విస్తాయి. అంతకుమించి విశేషంగా చెప్పుకునే అంశాలు ఈ 'ఊరు పేరు భైరవకోన'లో పెద్దగా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: