అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయ్యి ఆ తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలాంటి సినిమా లలో మత్తు వదలరా మూవీ ఒకటి. ఈ మూవీ లో శ్రీ సింహ హీరో గా నటించగా ... కమెడియన్ సత్య ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. రితీష్ రానా అనే దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తోనే ఈ దర్శకుడు డైరెక్టర్ గా తన కెరియర్ ను ప్రారంభించాడు.

మూవీ 2019 వ సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా థియేటర్ లలో విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని రోజు రోజుకు కలెక్షన్ లను పెంచుకుంటూ భారీ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకుంది. ఇకపోతే ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాకు కొనసాగింపుగా "మత్తు వదలరా 2" అనే సినిమాని రూపొందించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం మత్తు వదలరా మూవీ దర్శకుడు రితేష్ రానాసినిమా సీక్వెల్ కథపై ప్రస్తుతం పని చేస్తున్నట్లు ... అన్నీ కుదిరితే శ్రీ సింహ హీరో గా రితీష్ రానా దర్శకత్వంలో ఈ మూవీ కి సీక్వెల్ ఉండబోతున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే మత్తు వదలరా మూవీ నీ మైత్రి సంస్థ వారు నిర్మించారు. మరి "మత్తు వదలరా 2" మూవీ ని ఎవరు నిర్మించబోతున్నారు అనే విషయం తెలియాలి అంటే ఈ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: