తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన మాస్ హీరోలలో ఒకరు అయినటు వంటి మ్యాచో స్టార్ గోపీచంద్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇక పోతే ఈయన కొంత కాలం క్రితం సిటీమార్ అనే సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు . ఆ తరువాత పక్కా కమర్షియల్ , రామబాణం అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గోపీచంద్ కు నిరాశనే మిగిల్చాయి. 

ఇలా రెండు వరుస అపజాయలను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదుర్కొన్న గోపీచంద్ తాజాగా బీమా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మాళవికా శర్మ , ప్రియ భవాని శంకర్ హీరోయిన్ లుగా నటించగా ... హర్ష ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రవి బుశ్రుర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

సినిమా యొక్క "యూ కే" హక్కులను రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే "యూ కే" లో ఈ సినిమాథియేటర్ లలో విడుదల కాబోతుంది అనే విషయాన్ని కూడా ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో క్లియర్ గా తెలియజేసింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ మూవీ బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఎంతో బాగుండడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

gc