టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే పక్కా కమర్షియల్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు . కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

మూవీ ని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నప్పటికీ ఈ మూవీ బృందం మాత్రం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక చిన్న వీడియోను అలాగే కొన్ని పోస్టర్ లను తప్ప పెద్దగా అలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు.

ఇక ఈ మూవీ యూనిట్ ప్రస్తుతం ఈ సినిమా లోని మొదటి సింగిల్ విడుదలకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది.  మే 20 తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దేవర మూవీ నుండి మొదటి పాటను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు అన్ని కుదిరితే మే 20 వ తేదీన దేవర మూవీ ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: