తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ కాలంలో ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , టాక్సీవాలా , గీత గోవిందం లాంటి విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన గీత గోవిందం సినిమా తర్వాత నోటా , డియర్ కామ్రేడ్ , వరల్డ్ ఫేమస్ లవర్ , లైగర్ , ఖుషి , రీసెంట్ గా ది ఫ్యామిలీ మెన్ అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాలు అన్నీ కూడా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయ్యాయి. ఖుషి మూవీ ఒకటి పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించినప్పటికీ ఈ మూవీ.కి పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ ద్వారా నిర్మాతలకు భారీ మొత్తంలోనే నష్టాలు వచ్చాయి. అలా వరుస అపజయాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర డీలా పడిపోయిన విజయ్ తన తదుపరి మూవీ ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... గౌతమ్మూవీ ని అదిరిపోయే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించబోతున్నట్లు ... అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కూడా హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలైనట్టుగా సమాచారం. మరి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో అయినటువంటి విజయ్ దేవరకొండ ... తెలుగు పరిశ్రమలో మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి గౌతమ్ కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశం ఉంది. మరి ఈ మూవీతో విజయ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd