ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు పరిశ్రమలోనూ తెలంగాణ, ఆంధ్ర అనే ఫీలింగ్స్ ఎక్కువయ్యాయి. షూటింగ్‌కు ఒక రోజు ముందూ ప్రాజెక్ట్‌లు చేజారిపోయేవి. టైమ్‌కి రానని, లేటైతే ఉండనని, నా కాళ్లు విరిగిపోయాయని ప్రచారం చేసి నా కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చారు. అయినా నేనెప్పుడూ జడవలేదు. నా దారులన్నీ మూసేసినా కొత్త దారులు వేసుకుంటూ సాగిపోతున్నా. ఎలాంటి సపోర్టు, బ్యాక్‌గ్రౌండూ లేకుండా పరిశ్రమకు వచ్చి నేనేంటో నిరూపించుకున్నా.ప్రత్యేక పాటల్లో చేయమని చాలా సినిమాల్లో అడిగారు. రోల్ ఏదైనా ప్రేక్షకులను అలరించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదనేదే నా అభిమతం. అలా ఆలోచించి చేసిందే 'లీడర్’ సినిమాలోని 'రాజశేఖరా..' సాంగ్. ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చినా నేనొప్పుకోలేదు. మా కుటుంబమంతా అల్లు అర్జున్ అభిమానులం. అంత పెద్ద హీరోతో కలిసి ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉండేది. ఆయనెంత మంచి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. 'జులాయి' సినిమాలో ఆయన పక్కన స్పెషల్ సాంగ్ కోసం నన్ను తీసుకోవడం ఆనందమనిపించింది.ఊహ తెలిసినప్పటినుంచీ ఇండస్ట్రీనే నా కుటుంబం. జీవితంలోని గొప్ప క్షణాలను వాళ్లతో పంచుకోవాలనుకున్నా. నా కూతుళ్లకు ఫంక్షన్ చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేసినా సరిగ్గా స్పందించలేదు. ఒక్క బాలకృష్ణగారే తిరిగి కాల్ చేసి అటెండ్ అవుతానని మాటిచ్చారు. బాలయ్య మామ వచ్చి ఆశీర్వదించాడని ఇప్పటికీ నా కూతుళ్లు సంబురపడతారు. ఆయన మా ఇంటి సభ్యుడితో సమానం.చిన్నప్పటినుంచీ ప్రశ్నించే తత్వం ఎక్కువ. పాటలంటే మక్కువ. అందుకే నేను హోస్ట్‌గా చేసిన కొన్ని షోస్‌లో పాడిన పాటల నిండా ప్రశ్నల కొడవళ్లే. అవన్నీ నేను రాసినవే. స్త్రీలపై వివక్ష, ఆడపిల్ల సమస్యలే నా పాటకు ప్రధాన వస్తువు. ఇప్పటికీ మార్కెట్లో నా ఆల్బమ్స్ ఉన్నాయి. యూట్యూబ్‌లోనూ నా పాటలకు మంచి ఆదరణ ఉంది. కష్టం తెలిసిన మనుషుల మధ్య పెరిగాను. రైతు కష్టం విలువ తెలుసు. నాకున్న కొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నా. పంట పండించడం, నా చేత్తో వండిపెట్టడం చాలా ఇష్టం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి