గత కొన్ని నెలలుగా ఖాళీగా కనిపిస్తున్న ధియేటర్లకు కళ జూన్ చివరి వారంలో విడుదల కాబోతున్న ‘కల్కి 2898’ తో వస్తుందని ప్రభాస్ అభిమనులాతో పాటు ఇండస్ట్రీ వ్యక్తులు కూడ భావిస్తున్నారు. ఆసమయానికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతాయికాబట్టి ఇక అన్నిచోట్లా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడతుందని అందరి అంచనా. ఇక సినిమాలకు సంబంధించి కూడ ‘కల్కి’ విడుదల అయినప్పటి నుండి పూర్తి జోష్ తో వాతావరణం కనిపిస్తుందని మళ్ళీ ప్రేక్షకులు ధియేటర్ల బాట పడతారని అంచనాలు ఉన్నాయి.



ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ ఇప్పటివరకు ఏసినిమా విషయంలోను అనుసరించని యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కథ గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తూ అదేవిధంగా ఈమూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ ఒక చిన్న యానిమేటెడ్ సిరీస్ త్వరలోనే ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.



ప్రస్తుతం వీటికి సంబంధించిన పనులు చాల వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే 22న హైదరాబాద్ లో ఒక భారీ ఫ్యాన్ మీట్ పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ ను అన్ని ప్రాంతాల నుండి రప్పించి ఈమూవీ గురించి హడావిడి మొదలు పెట్టాలని నాగ్ అశ్విన్ మాష్టర్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ‘సలార్’ మూవీ విడుదలకు ముందు ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. ఇప్పుడు ఆలోటును ‘కల్కి’ తీరుస్తుందని అభిమానుల అంచనా..



మే 22 తరువాత ఈమూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ తో పాటు పాటలు కూడ విడుదల చేస్తారని అంటున్నారు. జూన్ మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి ఇక అందరి దృష్టి తిరిగి సినిమాల వైపు మళ్లుతుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత విడుదల కాబోతున్న మొట్టమొదటి భారీ సినిమా ‘కల్కి’ కావడంతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ఆకాశాన్ని అంటుతాయని ప్రభాస్ అభిమానుల అంచనా..  



మరింత సమాచారం తెలుసుకోండి: