‘దేవర’ విడుదల కాకుండానే జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల వేగం బాగా పెంచాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో బాలీవుడ్ మూవీ చేస్తున్న తారక్ ఈసంవత్సరం చివరిలో ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ నిర్మించబోయే ఈమూవీ స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయినప్పటికీ ఈమూవీలో నటించబోయే నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదు అన్న లీకులు వస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాకు ‘డ్రాగన్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు లీకులు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వార్తలు కూడ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం తమిళంలో ‘డ్రాగన్’ అన్న టైటిల్ తో ఒక మూవీ ప్రారంభం అయింది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాధన్ హీరో అశ్వత్ మారిముత్తు దర్శకుడు.ఇప్పటికే ఈమూవీ సగానికి పైగా షూటింగ్ అయిపోయిందని వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంటారని అంచనా. దీనితో ఈ టైటిల్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ తారక్ తో తాను తీయబోయే మూవీకి ఎలా పెట్టి ఉంటాడు అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.అయితే ఈ టైటిల్ చాల పవర్ ఫుల్ గా ఉండటంతో ఈ టైటిల్ ఖరార్ అయితే బాగుంటుందని జూనియర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో ‘సలార్ 2’ ను పూర్తి చేసే వరకు జూనియర్ తో తీయబోయే మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదనీ దీనితో ఈ టైటిల్ కు సంబంధించిన వార్తలు అన్నీ గాసిప్పులు మాత్రమే అంటూ కొందరు ఈ వార్తలను తేలికగా తీసుకుంటున్నారు. అసలు విషయం ఏమిటి అన్నది రానున్న రోజులలో తేలిపోతుంది. మరి తారక్ అభిమానుల కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి..  
మరింత సమాచారం తెలుసుకోండి: