టాలీవుడ్ టాప్ హీరోలు నటించిన సినిమాలకు సంబంధించిన పాటలు విడుదల అవుతున్నాయి అంటే అవి ఇది వరకు ఉన్న పాత రికార్డులను అన్నింటిని బద్దలు కొట్టాలి అని ఆ హీరో అభిమానులు కోరుకుంటూ ఉంటారు. అలా జరిగితే వారి సంతోషానికి అవధులు ఉండవు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో పాటల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు.కే అత్యధిక రికార్డులు ఉన్నాయి. ఈయన నటించిన సినిమాలోని పాటలే విడుదల అయిన 24 గంటలలో అత్యధిక వ్యూస్ ను సాధించిన సినిమాల లిస్టు లో మొదటి 4 స్థానాల్లో నిలిచాయి.

మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా అంటూ సాగే సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 17.42 మిలియన్ వ్యూస్ ను సాధించి మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా రూపొందిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్ని సాంగ్ విడుదల అయిన 24 గంటల్లో 16.38 మిలియన్ వ్యూస్ ను సంపాదించుకుంది. ఇక సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్ 14.78 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకోగా ,  ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమాలోని మా మా మహేష అంటూ సాగే సాంగ్ 13.56 మిలియన్ వ్యూస్ ను తెచ్చుకుంది. ఇలా మొదటి నాలుగు స్థానాల్లో కూడా మహేష్ పాటలు ఉన్నాయి. ఇకపోతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన దేవర మూవీ లోని ఫియర్ అంటూ సాగే సాంగ్ మే 19 వ తేదీన విడుదల అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ సాంగ్ మొదటి నాలుగు ప్లేస్ లలో ఏదో ఒక స్థానంలో నిలుస్తుంది అని జనాలు అంతా భావించారు. కానీ ఆ సాంగ్ ఆ విషయంలో చాలా వరకు ఫెయిల్ అయింది. దేవర మూవీ ఫస్ట్ సింగిల్ 24 గంటల్లో 5.91 మిలియన్ వ్యూస్ మాత్రమే లభించాయి. ఇలా దేవర మొదటి సాంగ్ మహేష్ బాబు రికార్డుల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. మరి ఈ సినిమాలోని రాబోయే పాటలతో ఎన్టీఆర్ , మహేష్ రికార్డులను బద్దలు కొడతాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: