టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన అందం, నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సమంతా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సమంత ఫిట్‌ ఫ్రీక్‌ అన్న విషయం తెలిసిందే. జిమ్‌లో ఆమె చేసే కసరత్తులు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.వ్యక్తిగత జీవితంలో ఒడి దుడుకులు, భర్తతో విడాకులు, ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ బారిన పడటం లాంటి కారణాలరీత్యా తన ఫిట్‌నెస్‌కు ఇచ్చే ఇంపార్టెన్స్‌ మరింత పెరిగింది.దీనికి సంబంధించి అనేక వీడియోలను ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫిట్టైన బాడీలో 'ఎన్నో ట్రైసెప్స్‌ డిప్స్‌ తర్వాత' అని రాసుకొచ్చింది. ఆ ఫొటో ఫిట్‌నెస్‌తోనే కాదు టూ హాట్‌గా కూడా ఉంది. దానిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. పోస్ట్‌ చేసిన గంట వ్యవధిలోనే 3 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ ఫొటో చూసిన సమంత బెస్ట్‌ ఫ్రెండ్‌ చిన్మయి కూడా సామ్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా అయింది.నీ ఫిట్నెస్‌లో సగమైనా సాధించాలని ఆశపడుతున్నాను' అంటూ కామెంట్‌ చేసింది. అంతే కాదు ప్రగ్యా జైస్వాల్‌, హన్సిక, రుహానీ శర్మ, కంగనా రనౌత్ వంటి సెలబ్రిటీలు ఫైర్‌ సింబల్‌తో కామెంట్‌ చేశారు. కొందరైతే సామ్‌ టూ హాట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే ుఒక్కోసారి స్టైలిష్‌ వేర్‌లో బాగానే కనిపిస్తావ్‌.. కొన్ని సందర్భాల్లో ఎందుకిలా హద్దులు దాటి మరీ ఎక్స్‌పోజ్‌ చేస్తావ్‌ సామ్‌' అంటూ ప్రశ్నిస్తున్నారు.మయోసైటీస్‌తో బాధపడుతున్న సామ్‌ కొంతగ్యాప్‌ తర్వాత మళ్లీ సినిమాలవైపు దృష్టిపెట్టారు. ఆమె నటించిన బాలీవుడ్‌ సిరీస్‌ సిటాడెల్‌ విడుదలకు సిద్ధమైంది. తన సొంత బ్యానర్‌ ట్రాలాలాలో తాజాగా 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని ప్రకటించారు సామ్‌. దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: