సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అయితే ఇలా వచ్చిన హీరోయిన్లు తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటే కొంతమంది మాత్రం కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితమై ఆ తర్వాత కనుమరుగై పోతు ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఎవరైనా హీరోయిన్ ఇలా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడిచిపోయింది అంటే చాలు ఆమెకు సీనియర్ హీరోయిన్ అనే ముద్ర పడిపోతూ ఉంటుంది. అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది సీనియర్ హీరోలు వరుసగా అవకాశాలు దక్కించుకుంటే.. కొంతమంది మాత్రం చివరికి అవకాశాలు లేక ఇండస్ట్రీలో కనుమరుగైపోతున్నారు.


 ఇలాంటి హీరోయిన్లలో మమత మోహన్ దాస్ కూడా ఒకరు అని చెప్పాలి. ఒకప్పుడు హీరోయిన్గా సెకండ్ హీరోయిన్ గా కూడా వరుసగా సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని బిజీ హీరోయిన్లలో ఒకరుగా కొనసాగారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు. అవకాశాలు కూడా రావడం లేదు. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ 30 ప్లస్ వయస్సు దాటిపోతున్నప్పటికీ.. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నారు మమతా మోహన్దాస్. ఈ క్రమంలోనే ఆమె ఎక్కడైనా ఇంటర్వ్యూకు హాజరైనా పెళ్లి గురించే ప్రశ్న ఎదురవుతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇటీవల పెళ్లి రిలేషన్షిప్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ హీరోయిన్. జీవితంలో కచ్చితంగా ఒక తోడు ఉండాలని భావించడం లేదు అంటూ మమత మోహన్ దాస్ చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రిలేషన్ షిప్ ఫై తన అభిప్రాయాలను పంచుకుంది. లాస్ట్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ప్రేమించాను. కానీ మా బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. రిలేషన్ ఉండాలి కానీ అందులో ప్రెషర్ ఉండకూడదు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేం  ప్రస్తుతం మంచి భాగస్వామి కోసం వెతుకుతున్న. సమయం వచ్చినప్పుడు అన్ని బయటకి వస్తాయి అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: