టాలీవుడ్ ఇండస్ట్రీ లో బుట్ట బొమ్మగా క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక లైలా కోసం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బొమ్మ అనంతరం వరస చిత్రాలతో ఇండస్ట్రీని ఊపేసింది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది.  దీంతో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతది అనుకున్న సమయంలో అలా వైకుంఠపురం లో తరువాత చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ అనే బిరుదు దకింది.

ఇక తర్వాత పూజా హెగ్డే  పని అయిపోయింది.. ఇక తెలుగులో సినిమాలు రావడం కష్టం అని ఎంతోమంది విమర్శించారు. కానీ అందరిని ఆశ్చర్య పరుస్తూ పూజా హెగ్డే  అటు దక్షిణాదిలోనూ ఇటు హిందీలోనూ మంచి ప్రాజెక్ట్ చేస్తూ.. రెమ్యూనరేషన్ కూడా ఎక్కడ తగ్గించకుండా తన హవాని కొనసాగిస్తుంది. ఇక ఇప్పుడు వరుస చిత్రాలతో పూజ మళ్లీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం అండమాన్ లో తమిళ్ సూపర్ స్టార్ సూర్యతో సినిమా చిత్రీకరణలో ఉంది పూజా హెగ్డే. ఈ చిత్రం తెలుగులోనూ విడుదలవుతుంది.

ఇక ఈ మూవీ తరువాత నిర్మాత సురేష్ బాబు, పూజా హెగ్డే  తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఉమెన్స్ ఓరియంటెడ్ సినిమా అని సమాచారం. ఇక ఇది అయ్యాక ప్రముఖ తమిళ్ దర్శకుడు సుందర్ సి ఒక కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రంలో కథానాయకగా పూజా హెగ్డే ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం కూడా వుమెన్ ఓరియంటెడ్ సినిమాగా రూపొందనున్నట్లు  సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా వరుస సినిమాల్లో బిజీగా ఉంటూ పూజ హెడే రెమ్యూనిరేషన్ కూడా గట్టి మొత్తం లోనే పుచ్చుకుంటుంది. అక్షరాల 4 కోట్ల రూపాయలు తీసుకుంటుంది ఈ భామ. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: