సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఫాన్స్ ఒపీనియన్ స్పష్టంగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా పలువురు హీరోల అభిమానులు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారో.. సోషల్ మీడియాలో వార్ ఎలా కొనసాగిస్తారో మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో రాజమౌళి డైరెక్టర్ నాగ్ అశ్విన్ పేర్లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. మరీ ముఖ్యంగా నాగ్ అశ్విన్ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాడు.

ప్రభాస్ తో కల్కి అనే సినిమాని రూపొందించిన ఈ డైరెక్టర్ జోన్ 27వ తారీకున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నాడు. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కోసం నాగ్ అశ్విన్ బాగానే కష్టపడ్డాడు. బుజ్జి అంటూ సరికొత్త అడ్వెంచర్స్ వెహికల్ ని కూడా ఇంటర్ డ్యూస్ చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన రెండో ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో మరింత హాప్స్ ని పెంచింది. అయితే అన్ని విషయాలలో పకడ్బందీగా ఉన్న ఈ డైరెక్టర్ రాజమౌళిని బీట్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నాడు. కానీ ఎంత ట్రై చేసినా కూడా జక్కన్న కాలి గోటికి  కూడా సరిపోడు అంటున్నారు రాజమౌళి ఫ్యాన్స్.

రీసెంట్ ట్రైలర్ చూస్తే బాహుబలి మూవీకి మించిన ఎలివేషన్స్ క్రియేట్ చేశాడు. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో మాత్రం నాగ్ అశ్విన్.. జక్కన్న స్టాండర్డ్స్ అందుకోలేకపోయాడు. జక్కన్న ఒక పక్క ప్లానింగ్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కే సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోషన్స్ నిర్వహిస్తారు. కానీ నాగ్ అశ్విన్ ఈ మ్యాటర్ లో వెనకబడ్డాడు. తెలుగులో ఆయన సరిగ్గా ప్రమోషన్స్ చేసిందే. చిన్న చిన్న ఈవెంట్స్ పెట్టి ఆయన సినిమాకి డప్పు కొట్టుకుంటున్నారు తప్పితే ఎక్కడ సినిమాలోని ఒరిజినల్ కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ భారీ హై పిచ్చే విధంగా ప్రమోషన్స్ నిర్వహించలేదు. కంటెంట్ బాగుంటే ప్రమోషన్స్ అవసరం లేదు అనుకున్నాడో లేకపోతే ఆయనకు ప్రమోషన్స్ సరిగ్గా చేయడం రాలేదో తెలియదు కానీ మొత్తానికి జక్కన్న అభిమానుల చేతికి చిక్కాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: