కొంతమంది దర్శకులు , కథ రచయితలు హీరోలకు తాము అనుకున్న స్టోరీ చెప్పే విధానంలో అనేక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. కొంత మంది చెప్పే పద్ధతి అద్భుతంగా ఉంటుంది. దానితో కథలో దమ్ము లేకపోయినా వారు చెప్పే పద్ధతి అద్భుతంగా ఉండడంతో సినిమాలు ఒకే అవుతూ ఉంటాయి. మరి కొంత మంది కథను అద్భుతంగా రాసుకున్న చెప్పే విధానంలో అంత డెప్త్ లేకపోవడంతో వారు సినిమా కథ చెబుతూ ఉంటే వినే వాళ్లకు పెద్ద ఇంపాక్ట్ రాదు. ఇలాంటి సందర్భమే తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా కథకు జరిగింది.

సినిమా కథ ఏమిటి ..? అసలు జరిగిన విషయం ఏమిటి అనేది తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని సంవత్సరాల క్రితం అతడు అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కథను మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ వినిపించాడట. ఇక త్రివిక్రమ్ కథ చెప్పడం మొదలు పెట్టిన 15 నిమిషాలకే పవన్ కళ్యాణ్ నిద్రపోయాడట. ఇక అది చూసిన త్రివిక్రమ్ ఈయనకు నచ్చి ఉండదు. అందుకే నిద్రపోయారు. ఇక తర్వాత కథ చెప్పిన పెద్ద ప్రయోజనం ఉండదు అని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోయారట.

ఇక ఆ తర్వాత కొంత కాలానికి అదే కథను మహేష్ బాబుకు వినిపించాడట. మహేష్ బాబు కూడా కథ మొత్తం విని ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడట. దానితో ఈ కథలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది. అందుకే ఎవరికి పెద్దగా నచ్చడం లేదు అని ఆయన అనుకున్నాడట. కానీ లోపలికి వెళ్ళిన మహేష్ తిరిగి కొంత సమయానికి బయటకు వచ్చి కథ బాగుంది సినిమా చేద్దాం అని అన్నాడట. ఇక చివరిగా ఈ సినిమా అతడు అనే టైటిల్ తో రూపొంది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: