బాలీవుడ్ నిర్మాత, నటుడు, రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ప్రస్తుతం పీకల్లోతు సమస్యల్లో ఉన్నాడని తెలిసిందే. ఎందుకంటే వరుసగా అతడు తీసిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఉన్న ఆస్తుల్ని కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది.ఇటీవలే ఆయన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి రిలీజ్ అయిన బడేమియాన్ చోటే మియాన్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి అతి పెద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా కేవలం 90 కోట్ల వసూళ్లనే తెచ్చి పెట్టింది. దీంతో ఈ నిర్మాణ సంస్థ భారీగా దెబ్బ తింది. ఈ సినిమా ఏకంగా 250 కోట్లకు పైగా అప్పులు తేలాయి. దీంతో ముంబైలోని ఏడు అంతస్తుల పూజా ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు సమాచారం తెలుస్తోంది.ఓ ప్రముఖ బిల్డర్ ఈ బిల్డింగ్ ని దక్కించుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే ఈ అమ్మకానికి ఒక్కరోజు ముందు జీతాలు సక్రమంగా చెల్లించలేదని ఉద్యోగుల నుంచి కూడా అనేక ఆరోపణలొచ్చాయి. దీంతో 80 శాతం స్టాప్ ని తగ్గించి మిగిలిన వారిని జుహూలోని ప్లాట్ కి కార్యాలయాన్ని తరలించినట్లు ఓ నివేదిక నుంచి సమాచారం తెలుస్తుంది.


 ప్రస్తుతం అక్కడ నుంచే కార్యకలాపాలు అన్నింటిని నిర్వహిస్తున్నారు.ఇక నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్స్ కి చాలా చరిత్రనే ఉంది.1986 వ సంవత్సరంలోనే ఈ సంస్థని ఏర్పాటు చేసారు. కానీ 1995 వ సంవత్సరం నుంచి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. తొలి సినిమా బ్లాక్ బస్టర్ కూలీ నెంబర్ వన్ ఆ తర్వాత ఇదే సంస్థలో చాలా సినిమాలు నిర్మించారు. అయితే గత కొన్నేళ్ల నుంచి ఈ సంస్థలో నిర్మించిన సినిమాలేవి సరిగ్గా ఆడటం లేదు. పైగా అవన్నీ కూడా తక్కువ బడ్జెట్ చిత్రాలే. వాటన్నిటిని కలిపితే భారీ బడ్జెట్ బడ్జెట్ అవుతుంది.ఇక చివరిగా నిర్మించిన బడేమియాన్ చోటేమియాన్ కి  మాత్రం ఏకంగా 350 కోట్లబడ్జెట్ పైగా వెచ్చించారు. ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో అన్ని రకాల అప్పులు బయట పడుతున్నాయి. ఇంకా అప్పులకు సంబంధించి పూర్తి వివరాలనేవి తెలియాల్సి ఉంది. అయితే అప్పులు పాలైన నిర్మాతని ఎలాంటి సినిమా అవకాశాలు లేక రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకొని ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: