టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు మరియు నిర్మాత అయినటువంటి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ కొంత కాలం క్రితం డెవిల్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. కాకపోతే ఈ సినిమాలోని కళ్యాణ్ రామ్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ "NKR 21" అనే వర్కింగ్ టైటిల్ తో రూపాందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అలనాటి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన విజయశాంతి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇక ఈమె ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది అని ఈ మూవీ బృందం అధికారికంగా ఓ పోస్టర్ ను విడుదల చేసి ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమా యొక్క షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క క్లైమాక్స్ యాక్షన్స్ సన్నివేశాన్ని ఏకంగా 1000 మంది ఆర్టిస్టులతో తెరకెక్కిస్తున్నట్లు , ఈ ఒక్క క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణకి 8 కోట్ల బడ్జెట్ ఖర్చుకానున్నట్లు తెలుస్తోంది. ఇక కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టిన మూవీ కూడా ఇదే అని తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లోని ఈ యాక్షన్ ఎపిసోడ్ ను 30 రోజులపా టు చిత్రీకరించడానికి షెడ్యూల్ ని కూడా ఇప్పటికే మూవీ బృందం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అలా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nkr