ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. దీంతో జాన్వి కపూర్ ను తెలుగు తెరపై చూడాలని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇక జాన్వి ప్రధాన పాత్రలో నటించిన ఉలుజ్ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ఎంతో మంది హీరో హీరోయిన్లు కేవలం ప్రొఫెషనల్ విషయాలను మాత్రమే కాదు పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే జాన్వికాపూర్ కూడా తన కెరీర్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమంలోనే ఈ విషయాలు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల సోషల్ మీడియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వి కపూర్. తనకు సోషల్ మీడియా అంటే ఎంతో భయం అంటూ చెప్పుకొచ్చింది. అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఉలుజ్ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మాట్లాడుతూ రేడిట్లో వచ్చే ట్రోల్స్ గురించి నాకు అంతగా తెలియదు. ఆ ప్లాట్ ఫామ్ లో ట్రోల్స్ గురించి నాకు తెలియదు. నా చెల్లి ఖుషి చెప్పింది. అయితే వాటిపై ఎలా స్పందించాలో కూడా నాకు తెలియదు. ఎంత దారుణమైన ట్రోల్స్ వచ్చిన నేను పట్టించుకోను అంటూ జాన్వికపూర్ చెప్పుకొచ్చింది.