తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని తెలుగు లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన పలకనామ దాస్ అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో విశ్వక్ హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. విశ్వక్ ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన అందులో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఆఖరుగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మాత్రం ఈ నటుడి చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం. ప్రస్తుతం విశ్వక్ "మెకానిక్ రాఖీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రవితేజ ముళ్ళపూడి అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా తోనే ఈయన దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తో పాటు సుధీర్ గంటా దర్శకత్వంలో మరో మూవీ.లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ విశ్వక్ కెరీర్ లో 13 వ సినిమాగా రూపొందుతుంది. ఈ మూవీ తో పాటు జాతి రత్నాలు మూవీ దర్శకుడు అనుదీప్ కే వీ దర్శకత్వంలో కూడా విశ్వక్ ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ అని విశ్వక్ కెరీర్ లో 14 వ మూవీ గా రూపొందబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs