రాంగోపాల్ వర్మకి ఇష్టమైన హీరోయిన్లు అంటే శ్రీదేవి, జయసుధ వంటి హీరోయిన్ల పేర్లు మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే అప్పట్లో ఓ హీరోయిన్ కోసం ఆర్జీవి ఓ స్టార్ డైరెక్టర్ ని చంపాలని చూసారట. మరి ఇంతకీ ఆర్జీవి చంపాలి అనుకున్నా డైరెక్టర్ ఎవరు? ఎందుకు  హీరోయిన్ కోసం డైరెక్టర్ చంపాలనుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఆర్జీవి హీరోయిన్ కోసం డైరెక్టర్ని చంపాలి అని అనుకున్నది ఎవరినో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుని..అయితే ఆ హీరోయిన్ ఎవరో కూడా మీకు ఇప్పటికే గుర్తుకు వచ్చి ఉంటుంది ఆమెనేనండి అతిలోకసుందరి శ్రీదేవి.. రాంగోపాల్ వర్మ కి శ్రీదేవి అంటే ఎంత పిచ్చి ప్రేమనో చెప్పనక్కర్లేదు.

ఆమె చనిపోయిన కూడా ఆమెను ఇప్పటికీ ఆరాధిస్తూనే ఉన్నాడు. అయితే అలాంటి ఆర్జీవి దర్శకేంద్రుడు సౌందర్యలహరి ప్రోగ్రాం లో శ్రీదేవితో కలిసి పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుకి శ్రీదేవికి మధ్య ఉన్న అనుబంధం బయటపడింది.అయితే రాఘవేంద్రరావు దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాకముందు ఆయన తండ్రి పెద్ద డైరెక్టర్.అలా ఓ రోజు తండ్రి దర్శకత్వంలో శ్రీదేవి బాలనాటిగా ఓ సినిమా చేసిందట.ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలో తండ్రి లేకపోవడంతో శ్రీదేవి మీద ఆయనే ఒక సన్నివేశం తెరకెక్కించాలని చూసారట. అలా రోడ్డు మీద శ్రీదేవిని పరిగెత్తుకుంటూ రమ్మని షాట్ రెడీ చేశారట.

అయితే అదే సమయంలో రోడ్డు మీద కారు కూడా రావడంతో సడన్గా శ్రీదేవి కి కారు తాకి అక్కడే స్పృహ తప్పి పడిపోయిందట. కానీ ఆరోజు శ్రీదేవికి పెద్ద ప్రమాదం తప్పిందట.ఆ కారు కాస్త ఎక్కువ స్పీడ్ తో గుద్దితే మాత్రం శ్రీదేవి ప్రాణాలు పోయేవట.ఇక ఈ విషయం రాఘవేంద్రరావు తండ్రికి తెలిసి కోపడ్డారట. అయితే ఈ విషయం శ్రీదేవితో ఆర్జీవి తో రాఘవేంద్రరావు చెబుతున్న సమయంలో శ్రీదేవికి ఏమైనా అయి ఉంటే నేను మిమ్మల్ని కచ్చితంగా చంపేసేవాడిని అంటూ లైవ్లోనే వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ వార్నింగ్ మాత్రం ఫన్నీ గానే ఇచ్చారు. అయితే అప్పటి ఓల్డ్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: