ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే అమ్మాయి.. నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది .. తొలి సినిమాతోనే సూపర్ క్రేజ్ ను అందుకుంది. అందం , అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది . మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టింది . అలాగే ఓ యంగ్ హీరోను ప్రేమించి రీసెంట్ గానే పెళ్లి కూడా చేసుకుంది . ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ? తన తొలి సినిమాలో హీరోగా నటించిన అబ్బాయి తోనే ప్రేమలో పడింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న విషయాన్ని ఎంతో రహస్యంగా ఉంచి రీసెంట్ గానే ఎంతో గ్రాండ్గా వివాహం కూడా చేసుకున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు..


 స్టార్‌ బ్యూటీ రహస్య గోరఖ్ ... టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం భార్య .. ఈ సంవత్సరం ఆగస్టు 22 న వీరి పెళ్లి జరిగింది. కర్ణాటకలో ఎంతో గ్రాండ్గా వీరీ వివాహం జరిగింది . ఇక పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం రీసెంట్ గానే క సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిన విషయం తెలిసిందే . గత కొన్నాళ్లుగా వరుస ప్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న కిరణ్ .. క సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రివ్యూస్ కూడా తెచ్చుకోంది .  ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది .


అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తన స్పీచ్ తో ఎంతో స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది రహస్య గోరఖ్‌.. నా భర్త కోసం ఈ సినిమా చూడండి అంటూ ఎంతో క్యూట్గా అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఇక దానికి సంబంధించిన వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. రహస్య , కిరణ్ ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లే. కానీ నటనపై ఆసక్తితో సినిమాల్లోకి అడుగుపెట్టారు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే కిరణ్, రహస్య జోడిగా సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: