మెగా డాటర్ నిహారిక ఈ మధ్యకాలం లో వచ్చిన మద్రాస్ కారన్ మూవీ కి సంబంధించి ఒక సాంగ్లో ఏ విధంగా బోల్డ్ గా నటించిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమా లో అప్పట్లోని నగిలా నగిలా అనే పాటని మళ్లీ తీసుకున్నారు. అయితే ఈ పాట లో నిహారిక ఎంత బోల్డ్ గా రొమాన్స్ చేసిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ పాట లో చూసిన నిహారిక ను మునుపెన్నడూ చూడలేదు అనే విధంగా నటించింది. అయితే ఈ పాట లో నిహారిక చేసిన రొమాన్స్ చూసి చాలామంది నిహారిక పై ట్రోల్స్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ పరువు తీస్తున్నావ్ అంటూ ఆమెపై విరుచుకు పడుతున్నారు. మీ బాబాయ్ డిప్యూటీ సీఎం అయ్యారు.. ఆయనకు తగ్గ హోదా లో ఉండు.. నువ్వు సినిమాల్లో నటించు పరవాలేదు.

 కానీ  ఇలాంటి పాత్రలను ఎంచుకోకు.. అంటూ ఎంతో మంది ఈమెను విమర్శించారు. కానీ సినిమా ఇండస్ట్రీ కి వెళ్తే ఇలాంటివన్నీ కామన్. ఈ కామెంట్ల ని నిహారిక కూడా అంతగా పట్టించుకోదు. అయితే నిహారిక బోల్డ్ రొమాన్స్ చేసిన వేళ వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. అందుకే నిహారిక ను కొడతాను అంటూ వరుణ్ తేజ్ మాట్లాడిన మాటలను నిహారిక రొమాన్స్ చేసిందానికి ట్యాగ్ చేస్తూ నిహారిక అలా బోల్డ్ గా నటించడం వల్లే వరుణ్ తేజ్ ఇంటికి వెళ్ళాక కొట్టారు కావచ్చు అని కామెంట్స్ పెడుతున్నారు.
 
అయితే వరుణ్ తేజ్ నిహారిక ను కొట్టడానికి కారణం నిహారిక చాలా సందర్భాలలో అబద్ధాలు ఆడుతుందట. అబద్ధాలు ఆడడం వల్లే నిహారిక తన తో దెబ్బలు తింటుంది అని వరుణ్ తేజ్  ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ ఈ విషయాన్ని నిహారిక రొమాన్స్ చేసిన దానికి అనుసంధానం చేస్తూ కొంతమంది వరుణ్ తేజ్ మాటలను వైరల్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: