జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదలైతే థియేటర్లలో ఏ స్థాయిలో సందడిగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ తన సినీ కెరీర్ లో దాదాపుగా అన్ని జానర్ల సినిమాలలో నటించి తన నటనతో మెప్పించారు. పవర్ స్టార్ పవన్ గత 5 సినిమాల కలెక్షన్ల వివరాలు వైరల్ అవుతుండగా ఆ వివరాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.
 
పవన్ గత సినిమా బ్రో 2023 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కేవలం 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ కు ఈ కలెక్షన్లు ఒకింత తక్కువ మొత్తం అనే చెప్పాలి. పవన్ భీమ్లా నాయక్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా ఏపీలో టికెట్ రేట్లు తక్కువగా ఉండటం ఈ సినిమాకు మైనస్ అయింది. ఈ సినిమా ఫుల్ రన్ లో 98 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.
 
వకీల్ సాబ్ సినిమా విడుదలైన కొన్ని రోజులకే కరోనా కేసులు పెరగడం ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించడం ఒక విధంగా మైనస్ అయింది. వకీల్ సాబ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 86.36 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. 2018 సంవత్సరంలో థియేటర్లలో విడుదలైన అజ్ఞాతవాసి మూవీ ఫుల్ రన్ లో కేవలం 57.5 కోట్ల రూపాయల కలెక్షన్లకు సొంతం చేసుకుంది.
 
కాటమరాయుడు మూవీ ఫుల్ రన్ లో 61.1 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలు మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించే ఛాన్స్ ఉంది. పవన్ సినిమాలు సులువుగానే 100 కోట్ల రూపాయల షేర్ కలెక్ష్హన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కొత్త సినిమాలకు మాత్రం ఓకే చెప్పే అవకాశం అయితే లేదని సమాచారం అందుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: