యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఈ చిన్నది జబర్దస్త్ షో ద్వారా ఎనలేని గుర్తింపును అందుకుంది. ఆ షోలో యాంకరింగ్ చేస్తూనే వివిధ ప్రోగ్రామ్ లలో అవకాశాలను అందుకుంది. మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. వరుసగా సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

 అంతేకాకుండా తనకు సమయం దొరికినప్పుడల్లా అభిమానులను అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ చిన్న దానికి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలకు విపరీతంగా లైక్స్ వస్తాయి. అదే స్థాయిలో కొంతమంది నెగటివ్ గా కూడా కామెంట్లు చేస్తారు. అయినప్పటికే అనసూయ వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉండగా.... అనసూయకు సంబంధించి ఏదో ఒక వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంటాయి.

ఈ క్రమంలోనే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అనసూయ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. డబ్బులు ఇస్తే ఎలాంటి సినిమాలోనైనా నటిస్తానని అనసూయ అన్నారు. అంతే కాకుండా సినిమాలో అవకాశం వచ్చిందంటే చాలు పాత్ర ఏదైనా సరే మంచి రెమ్యూనరేషన్ ఇచ్చినట్లయితే తప్పకుండా నటిస్తానని అనసూయ అన్నారు. పాత్ర గురించి అసలు పట్టించుకోనని, కేవలం డబ్బులు మాత్రమే తనకు ముఖ్యం అన్నట్లుగా అనసూయ మాట్లాడారు.

అంతేకాకుండా డబ్బులు ఎక్కువగా ఇస్తే ఐటమ్ సాంగ్స్ కూడా తప్పకుండా చేస్తానని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. డబ్బుల కోసం ఎంత దిగజారుడు పని అయినా చేస్తావా అంటూ నెగిటివ్గా స్పందిస్తున్నారు. ఈ కామెంట్లపై అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: