మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి సమంత హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

అలాగే ఈ సినిమాలోని సమంత నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి సుకుమార్ కు మంచి ప్రశంసలు కూడా దక్కాయి. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ , సుకుమార్ కాంబినేషన్లో మరో మూవీ రూపొందబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరియర్లో 17 వ మోవీ కావడంతో ఆర్ సి 17 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా సమంత నటించబోతున్నట్లు రంగస్థలం కాంబోను మళ్లీ సుకుమార్ రిపీట్ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సుకుమార్ , రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో సమంత హీరోయిన్గా నటించడం లేదు అని , కేవలం ఆ వార్తలు అన్ని అవాస్తవం అని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత సుకుమార్  సినిమాను చరణ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ , బుచ్చిబాబు సనా కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: