ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి సంబంధించిన సినిమాల పోటీ ఇప్పటి నుండే మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే చాలా సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి కి పోటీ పడడానికి రెడీ అవుతున్నాయి. అలా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కావడానికి రెడీ అవుతున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోవ్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రి సంస్థ వారు ప్రస్తుతం డ్రాగన్ అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి , అనిల్ రావిపూడి కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ సినిమా స్టార్ట్ కాబోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయాలి అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. టాలీవుడ్ యువ నటుడు నవీన్ పోలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి విడుదల కావడానికి ఇప్పటికే నాలుగు సినిమాలు రెడీ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: