సినిమా ఇండస్ట్రీ లో గాసిప్స్ అనేవి సర్వసాధారణం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో పాలన హీరో , ఫలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినట్లయితే దానితో ఆ హీరోకు కానీ , ఆ దర్శకుడికి గాని అద్భుతమైన క్రేజ్ ఉన్నట్లయితే వెంటనే ఆ కాంబోలో మూవీ రాబోతుంది అని వార్తలు వైరల్ కావడం జరగడం సర్వ సాధారణం. ఇకపోతే ఇలాగే అనేక సార్లు ఓ కాంబోలో మూవీ రాబోతుంది అని వార్తలు వచ్చిన ఇప్పటి వరకు వారి కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం విలువడలేదు. ఆ కాంబో మరేదో కాదు. రామ్ పోతినేని , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ మూవీ.

చాలా కాలం నుండి రామ్ పోతినేని హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది అని వార్తలు వస్తున్నాయి. దానితో రామ్ పోతినేని అభిమానులు ఎప్పుడూ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మా అభిమాన హీరో సినిమా ఉంటుందా అని ఎదురు చూడడం , ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు ఆ వార్తలు సైలెంట్ కావడం జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు వీరిద్దరి కాంబో లో మూవీ మాత్రం రాలేదు. అలాగే అందుకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువబడలేదు. ప్రస్తుతం రామ్ "రాపో 22" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కొంత కాలం క్రితం గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. త్రివిక్రమ్ తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి అయ్యి , ఈ మూవీ స్టార్ట్ అయ్యి విడుదల కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఇంకా చాలా కాలం పాటే వీరి కాంబోలో మూవీ రావడం కష్టం అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: