ఈ కేసులో ఇప్పటికే ఆమె నుండి 14 కోట్లకు పైగా విలువైన బంగారం, నగదును సీజ్ చేశారు. అంతేకాకుండా 15 రోజుల్లోనే రన్యా నాలుగుసార్లు దుబాయ్ కి వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. తరచూ ఆమె గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. అన్ని సార్లు దుబాయి వెళ్లి రావడంతో అనుమానం వచ్చి ఆమెను చెక్ చేసినట్టు సమాచారం. మరోవైపు దుబాయ్ కి వెళ్లి ప్రతిసారి ఒకే రకమైన బట్టలు వేసుకున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు ఆమె రాకపోకులపై ఫోకస్ పెంచారు. ఇటీవల ఆమెను పట్టుకోగా ఏడాది కాలంలా ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్టు గుర్తించారు. పక్కా ప్లాన్ తో డీఆర్ఐ అధికారులు రన్యాను పట్టుకున్నారు.
ఆమె సాధారణ ప్రయాణికురాలిగా చెకింగ్ దాటుకుని బయటకు వస్తున్న సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఆమె వద్ద బంగారం చూసి ఆశ్చర్యపోయారు. కంపెగౌడ ఎయిర్ పోర్ట్ లో స్వాధీనం చేసుకున్న బంగారంలో ఇదే అతి పెద్ద మొత్తం అని చెబుతున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని తనను కొంతమంది బెదిరించినట్టు రన్యా విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. డిపార్ట్ మెంట్ అధికారుల సూచన మేరకు ప్రోటోకాల్ అందించమని డీఆర్ ఐ అధికారుల ముందు పోలీసు అధికారి తెలిపాడు. ఈ కారణంగా కేసులో అధికారుల సాయం కూడా ఉందని అనుకుంటున్నారు. మరి విచారణ పూర్తి అయ్యేలోపు ఇంకెన్ని విషయాలు బయట పడతాయో చూడాలి.