
మొన్నటి వరకు సూరారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు .. అద్దె ఇంట్లో ఇబ్బందులు వస్తున్నాయని తమ కొడుకు ఇంట్లో ఉండేందుకు కోకాపేట్ కు వచ్చారు .. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటున్నారు .. ఇక దాంతో రాజ్ తరుణ్ పేరెంట్స్ రాగానే వారిని ఇంట్లోకి రానివ్వకుండా లావణ్య అడ్డుపడింది . ఇక దాంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పదిమందితో కలిసి వచ్చి ఆమె ఇంటిపై దాడికి దిగారంటూ లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది .. అలాగే తన కేసు కోర్టు పరిధిలో ఉందని పోలీసులతో మాట్లాడిన తర్వాత ఇంట్లోకి రావాలని ఆమె తేల్చి చెప్పింది .. అంతేకాకుండా తనను ఇంట్లో నుంచి బయటకు పంపడానికి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చారంటూ లావణ్య ఆరోపణలు చేస్తుంది ..
ఇక దాంతో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక ఇంటిబయటే గత రాత్రి అంతా ఉండిపోయారు .. ఇక తమ కొడుకు కష్టపడి కొన్న ఇల్లని .. లావణ్య నుంచి తమకు న్యాయం చేయాలని రాజ్ తరుణ్ పేరెంట్స్ పోలీసులను కోరారు .. అలాగే ఈ ఇంటి నిర్మాణం కోసం రాజ్ తరుణ్ కు కోటి రూపాయలు ఇచ్చానని లావణ్య తండ్రి చెబుతున్నాడు .. కానీ అదంతా అబద్ధమని రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్పుకొస్తున్నారు .. అలాగే తాము కోకపేట్ నివాసానికి వస్తున్నట్లు రాజ్ తరుణ్ కు కూడా తెలియదని వారు అంటున్నారు .. అయితే చివరికి పోలీసులు అక్కడికి వచ్చి లావణ్యతో సంప్రదింపులు జరిపి .. చివరకు రాజ్ తరుణ్ అమ్మానాన్నలను ఇంట్లోకి రాణించేందుకు లావణ్య అనుమతించింది .. ఇక దాంతో వారు ఈ విల్లాలోకి చేరుకున్నారు .. ఇక ఇప్పుడు లావణ్య , రాజ్ తరుణ్ వ్యవహారంలో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి .