నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోహన్ బాబు వారసురాలిగా చిత్రపరిశ్రమకు పరిచయమైన మంచు లక్ష్మి తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ మంచు లక్ష్మి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటించి ముందుకు వెళ్తున్నారు. మంచు లక్ష్మి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం భాష చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. 



ఇంకా మంచు లక్ష్మికి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ లో ఫుడ్, ట్రావెలింగ్, లైఫ్ స్టైల్ కి సంబంధించిన వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలోనూ మంచు లక్ష్మి చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.


అంతేకాకుండా మంచు లక్ష్మి సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్లు చేస్తూ వాటిని తన అభిమానులలో పంచుకుంటూ ఉంటుంది. ఇక మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పైన మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ మంచు లక్ష్మి వెల్లడించారు. ఈ యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే సులభంగా డబ్బులను సంపాదించవచ్చని నేను కూడా ఈ యాప్ ను వాడుతున్నాను అంటూ కొంతమంది దుండగులు మంచు లక్ష్మి ఇన్ స్టోరీలో షేర్ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి ఇలాంటివి నమ్మద్దు అంటూ చెప్పారు. అంతేకాకుండా తన ఇన్ స్టా అకౌంట్ హ్యాక్ అయిందని లక్ష్మి అన్నారు. తనకు డబ్బులు అవసరం ఉంటే సోషల్ మీడియా వేదికగా కాకుండా డైరెక్ట్ గానే అడుగుతానని మంచు లక్ష్మి వెల్లడించారు. ఇలాంటి స్టోరీలకు ఎవరూ కూడా అసలు రిప్లై ఇవ్వద్దని లక్ష్మీ సూచించారు. లక్ష్మీ షేర్ చేసుకున్న ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: