ప్రస్తుతం మహేష్ అభిమానుల ప్రవర్తన చూస్తుంటే .. మన పెద్దలు చెబుతున్న ఓ మాట గుర్తుకు వస్తుంది ..  ఎన్నో కష్టాల్లో ఉన్న ఒక్కడికి ఓ బంగారు బాతు దొరుకుతుంది .. దాని లక్షణం ఏమిటంటే రోజుకొక బంగారు గుడ్డు ఇస్తూ ఉంటుంది .. అలా దాన్ని అమ్ముకొని దర్జాగా ఆ వ్యక్తి త‌న జీవితాన్ని గడుపుతూ ఉంటాడు . కానీ ఒకరోజు హఠాత్తుగా వాడుకో పిచ్చి ఆలోచన వస్తుంది రోజుకో బంగారు గుడ్డు ఇచ్చే బాతు  లోపలా ఇంకెన్ని బంగారు గుడ్డులు ఉంల‌య్యో అని ఒకసారి కోసి చూస్తే మళ్ళీ మళ్ళీ అదే పని చేయాల్సిన అవసరం ఉండదు కదా అని అతను అనుకుంటాడు .. ఆస‌మయంలో క్షణం ఆలస్యం చేయకుండా కత్తి తీసుకుని బాతును చంపేసి పొట్ట లోపల చూస్తే మాంసం తప్ప ఏమీ ఉండదు .. దాంతో తన తప్పు తెలుసుకుని బోరున ఏడుస్తాడు ..


ఇక ఇప్పుడు ఈ స్టోరీ చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది .. మహేష్ బాబు అభిమానుల ఎమోషన్లు .. పాత సినిమాల రీ రిలీజ్ అను వారు ఆదరిస్తున్న తీరు ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు , నిర్మాతల‌ అత్యాశకు తెరలేపే సమయం సందర్భం లేకుండా వరుసగా థియేటర్లో సినిమాలను వదులుతూ ఆ హీరో విలువను తగ్గిస్తున్న వైనం కనిపిస్తుంది .. ఇప్పటికే ఈ వారం ఒక్కడు అంతకుముందు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాల‌ను ప్రేక్షకు ముందుకు తీసుకువచ్చారు .. ఇప్పుడు వచ్చేవారం ఏప్రిల్ 26న భరత్ అనే నేను సినిమా వస్తుండగా ఆపై మే 30న ఖ‌లేజా , తర్వాత మే 31న  అతిథి ఇలా వరుసగా సినిమాలను ప్లాన్ చేశారు .. ఎంత సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు అయితే ఒకేసారి రెండు సెలబ్రేషన్స్ అంటే ఫ్యాన్స్ మీద ఎంతో భారం పడుతుంది .. అతిధి సినిమాను ఎప్పుడో ప్లాన్ చేసింది  .. కానీ ఖ‌లేజా అని ఊహించిన విధంగా మధ్యలో తీసుకువచ్చారు ..


ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే .. అభిమానుల ఆశలను ఎమోషన్లను ఎంతో సున్నితమైనవి .. ఇక వాటిని డబ్బుతో ఖరీదుతో అసలు కొనలేం .. కానీ వారి  స్థోమతకు మించి వారి నుంచి ఖర్చు పెట్టించడం మంచి పద్ధతి కాదనేది వాస్తవం .. ఏదో సంవత్సరానికి ఒకటి అంటే ఓకే చేసిన 28 సినిమాల్లో ఆరేడు ఒకే సంవత్సరంలో విడుదల చేస్తే హీరో వేల్యూతో పాటు వాటి వేల్యూ కూడా పోతుంది .. అభిమానుల జేబులు కూడా ఖాళీ అవుటం తప్ప జరిగేది ఏమీ ఉండదు .. సినిమాలను చూడకుండా ఉండలేని వాళ్ళు బలహీనతను ఇంతగా క్యాష్ చేసుకోవడానికి ఎందుకు ఇంత దిగజారుగుతున్నారు అన్నది అసలు ప్రశ్న .. ఇక దీనికి సమాధానం దొరికే లోపే టక్కరి దొంగ , నిజం , రాజకుమారుడు అంటూ మరికొన్ని సినిమాలు రెడీ అయిపోయిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు ..

మరింత సమాచారం తెలుసుకోండి: