టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆఖరుగా గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ ద్వారా రామ్ చరణ్ కు భారీ అపజయం దక్కింది.

ప్రస్తుతం చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. శివరాజ్ కుమార్మూవీ లో కీలక పాత్రలో కనిపించనుండగా ... జగపతి బాబు ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వ్రిద్ది సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లేకపోతే ఈ మూవీ తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ చరణ్ "పెద్ది" సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో కాకుండా మరో సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన బ్యానర్లలో ఒకటి అయినటువంటి యు వి క్రియేషన్స్ బ్యానర్లో చరణ్ "పెద్ది" మూవీ తర్వాత ఓ సినిమా చేయనున్నట్లు , ఆ మూవీ పూర్తి అయిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పటి వరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: