టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నటీమణులు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో నటి కస్తూరి ఒకరు. తెలుగువారు ముఖ్యంగా గృహలక్ష్మి సీరియల్ యాక్టర్ అంటే ఈజీగా గుర్తుపడతారు. ఈమె ఒకానొక సమయంలో హీరోయిన్ గా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా నటించి గుర్తింపు పొందింది. కొన్నేళ్ల క్రితం కస్తూరి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి సీరియల్స్ లోను నటించింది. 

తెలుగులో గృహలక్ష్మి సీరియల్ తో సక్సెస్ సాధించింది. ప్రస్తుతం కస్తూరి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ సాధిస్తుంది. సోషల్ మీడియా లోనూ కస్తూరి చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే నటి కస్తూరికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. నటి కస్తూరి ప్రతిరోజు రాత్రి 9 అయ్యిందంటే చాలు తనకు ఓ అలవాటు ఉందట. 

ఆ అలవాటు మానుకోవడానికి ఎంతో ప్రయత్నించినప్పటికీ తన వల్ల కావడం లేదట. రాత్రి 9 అయ్యిందంటే చాలు తన మనసు లాగినట్టుగా అనిపిస్తుందట. అదేంటో కాదు తనకు ప్రతిరోజు బయటి ఫుడ్ తినే అలవాటు ఉందట. ఇక రాత్రి 9 అయ్యిందంటే ఏదో ఒక జంక్ ఫుడ్ బయట నుంచి తెచ్చుకొని తినే అలవాటు ఉందట. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ తన వల్ల కావడం లేదట. తన జిమ్ ట్రైనర్ కూడా ఈ అలవాటు మానుకోమని చాలా సందర్భాలలో వెల్లడించాడట. ఈ విషయాన్ని నటి కస్తూరి ఓ సందర్భంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: