స్టార్ హీరోయిన్ సమంతకు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. సమంత పారితోషికం కూడా 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. సమంత సొంత బ్యానర్ పై శుభం అనే సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.
 
టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అయిన హీరోయిన్లు చాలా తక్కువమంది ఉన్నారు. మెజారిటీ హీరోయిన్లకు నిర్మాణ రంగం అస్సలు కలిసిరాలేదు. అయితే సమంత మాత్రం శుభం సినిమాతో నిర్మాణ రంగంలో సైతం సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. హర్షిత్ మల్గిరెడ్డి, శ్రీయ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది.
 
ఒకింత భారీ బడ్జెట్ తో, వినూత్న కథాంశంతో సమంత ఈ సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. హారర్-కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కగా వివాహం తర్వాత కొత్త జంట మధ్య జరిగే సంఘటనలు, భయానకత వంటి అంశాలను సినిమాలో ప్రస్తావించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ ను టాప్ బ్యానర్ గా నిలపడంలో సక్సెస్ అవుతారేమో చూడాలి.
 
ఈ చిత్రం సమంతా నిర్మాతగా చేసిన తొలి ప్రయత్నం కావడంతో, ప్రేక్షకులు మరియు సినీ పరిశ్రమలో వ్యక్తులు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందా అని ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతుందేమో చూడాల్సి ఉంది. సమంతను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సమంత సోషల్ మీడియా వేదికగా సైతం క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. సమంత సోషల్ మీడియా వేదికగా క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: