
కాగా ఇప్పుడు ఇదే ప్రభాస్ కి పెద్ద తల నొప్పిగా మారింది. ప్రభాస్ హీరో గా నటిస్తున్న వన్ ఆఫ్ ది బిగ్ ప్రాజెక్ట్ "ఫౌజి". ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమ్మాన్వి సెలెక్ట్ అయింది . ఇమాన్వి పాకిస్తాన్ అమ్మాయి అని ఈ సినిమా నుంచి ఆమెని తీసేయండి అని ఆమెను అసలు ఇండియాలోనే లేకుండా తరిమికొట్టండి అంటూ ఘాటుగాటుగా జనాలు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇమ్మాన్వి కూడా రియాక్ట్ అయింది.
" నేను పాకిస్తానీని కాదు అంటూ చెప్పుకొచ్చింది". అయినా సరే ఫాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు. ప్రభాస్ సినిమాలో ఆమె హీరోయిన్గా పెడితే సినిమాని ఫ్లాప్ చేస్తామని మర్యాదగా ఆ హీరోయిన్ ని తీసేసి వేరే హీరోయిన్ పెట్టుకుంటే బెటర్ అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. మేకర్స్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారట . ఈ ప్రాజెక్టు నుంచి తప్పించి మరొక బ్యూటీని తెరపైకి తీసుకురావాలి అన్న ఆలోచనలో ఉన్నారట. ఇప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో ఏ సినిమా విషయంలోనూ ఇలా జరగలేదు . ఒక సినిమాకి కమిట్ అయ్యి కొంత సినిమా షూటింగ్ అయిన తర్వాత ఆ హీరోయిన్ ని తీసేసి మరొక హీరోయిన్ రావడం ప్రభాస్ సినీ కెరియర్ లోనే ఇదే ఫస్ట్ టైం అంటున్నారు జనాలు..!